Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్‌తో పాటు మరో ముగ్గురిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులుగా చేర్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ మేరకు ఎసిబి ప్రత్యేక కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. ఇందులో బిజెపి జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్‌ను నాలుగో నిందితుడిగా పేర్కొంది. తుషార్‌ను ఐదవ నిందితుడా చేర్చిన సిట్, కేరళ వాసి జగ్గుస్వామిని 6, కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ని 7వ నిందితుడిగా చేరుస్తూ సిట్ మోమో దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులైన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, నందకుమార్‌ల స్వర నమూనాపై ఫోరెన్సిక్ తన నివేదికను సిట్‌కు అందించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి, ఈ కేసును విచారిస్తున్న సిట్, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌కు రెండవ నోటీసును కూడా జారీ చేసింది. తాజా నోటీసులో, నవంబర్ 26 లేదా నవంబర్ 28 న విచారణ కోసం సిట్ ముందు హాజరు కావాలని ఆయనను కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముగ్గురు వ్యక్తులు సతీష్‌శర్మ అలియాస్ రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజులు స్వామీజీలపై, అక్టోబర్ 26 న నలుగురు శాసనసభ్యులలో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.