There has been a shooting in Krymsk, Russia leaving 4 dead including perp and 1 injured pic.twitter.com/v9sjLHuZzP
— Delilah (@sm0k3bl34ch) November 24, 2022
Authorization
There has been a shooting in Krymsk, Russia leaving 4 dead including perp and 1 injured pic.twitter.com/v9sjLHuZzP
— Delilah (@sm0k3bl34ch) November 24, 2022
హైదరాబాద్ : రష్యాలోని క్రిమ్స్‌క్ పట్టణంలో 66 ఏండ్ల వృద్ధుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. తుపాకీ చేతపట్టుకుని పట్టణంలోని ఓ విధి గుండా నడుస్తూ ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం తాను కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు దవాఖానకు తరలించారు. అయినా అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా ఓ సీసీటీవీలో నమోదయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 66 ఏండ్ల వయస్సు కలిని ఓ వ్యక్తి.. క్రిమ్స్‌క్‌లోని వీధుల్లో తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బుల్లెట్ తగలడంతో కుప్పకూలిపోయిన ఓ వ్యక్తి దగ్గరికి వెళ్లిన ఆ వృద్ధుడు మరోసారి అతనిపై కాల్పులు జరిపాడు. అనంతరం ఆయన కూడా కాల్చుకుని చనిపోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అని అధికారులు తెలిపారు. కాగా, రష్యాలోని క్రస్నొడార్ రీజియన్‌లో చిన్న పట్టణం క్రిమ్స్‌క్. అది భారీ వాణిజ్య సముదాయాలకు గుర్తింపుపొందింది.