Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. అయ్యో అనాల్సింది పోయి..అసలు పట్టించుకోలేదు అక్కడి జనాలు. అసలు లారీలో ఉన్న మనుషులకు ఏమైనా అయ్యిందా అని కూడా కనికరం చూపించలేదు. మాకు తెలియదనంటూ చేపల కోసం సంచులు పట్టుకుని వచ్చి ఎంచక్కా ఎత్తుకుని వెళ్లారు. మరి..లారీ డ్రైవర్, క్లీనర్ బ్రతికి ఉన్నారా.. అని కూడా చూడకుండా ఇలా చేపల కోసం ఎగబడ్డారు.
ఈ ఘటన ఏలూరు జిల్లా జీలుగుమిల్లీ మండలం దర్భగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. లారీ కిందపడ్డంతో చేపలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. కర్ణాటక నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.