Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని శ్రీశైలం - హైదరాబాద్ హైవే పై బుధవారం సాయంత్రం పర్యాటకులకు పెద్ద పులి కనిపించింది. ఏటీఆర్ లోని శ్రీశైలం - హైదరాబాద్ రహదారి ఫరహాబాద్ నుంచి వటవర్లపల్లికి వెళ్లే జాతీయ రహదారిపై బోరెడ్డి బాయి సమీపంలో సాయంత్రం వేళలో ఓ ఆడపులి రోడ్డు దాటింది. శ్రీశైలం వెళుతున్న పర్యాటకులు ఇది చూసి వీడియోలు, ఫొటోలు తీశారు. ఈ పులి పేరు సూపర్ మదర్టైగర్ అని, ఏడేండ్లుగా 7 నుంచి 8 పిల్లలకు జన్మనిచ్చిందని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్పారు.