Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఏరియాలో శుక్రవారం నుంచి ట్రాఫిక్ను దారి మళ్లించనున్నట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నేటి నుంచి వారం రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తామని.. ఆ తర్వాత ఇబ్బంది ఉంటే కొన్ని మార్పులు చేస్తామని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, రోడ్ నం.45, జర్నలిస్టు కాలనీ రూట్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వెహికల్ డైవర్షన్ చేపట్టినట్లు తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి వచ్చే వెహికల్స్ రోడ్ నం.45 వైపునకు ఈజీగా చేరుకునేందుకు ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ను ఆయన వివరించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.