Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గత నాలుగు రోజులుగా బంగారం ధర కొనుగోలుదారులు కాస్త సంతోషంగా ఉన్నారు. కానీ నేడు మాత్రం ఈ నాలుగు రోజుల్లో ఎంతైతో తగ్గిందో దాదాపు అంత మేర పెరిగింది. గడిచిన నాలుగు రోజుల్లో తొలి రోజు స్థిరంగా ఉన్న బంగారం ధర ఆ తరువాత నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. కానీ నేడు బంగారం ధర తులంపై రూ.330 వరకూ పెరిగింది. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.48,550కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,970కు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే..కిలోపై రూ.120 మేర పెరిగి నేడు రూ. 62,200లకు చేరుకుంది.