Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐ ఫోన్లతో పాటు చార్జర్లు ఇవ్వడాన్ని యాపిల్ కంపెనీ ఎప్పుడో నిలిపివేసిన సంగతి తెలిసిందే. భారత్ తదితర దేశాల్లో ఈ విషయంలో యాపిల్ కు ఎటువంటి సమస్యల్లేవు. అలానే కొనసాగుతుంది. కానీ, బ్రెజిలో ఇది కుదరదు. ఫోన్ తో పాటు ఎంతో ముఖ్యమైన ఉపకరణం ఇవ్వడం లేదంటూ రిటైల్ స్టోర్ల నుంచి పెద్ద ఎత్తున యాపిల్ ఐఫోన్లను అక్కడి అధికారులు సీజ్ చేశారు. అంతె కాకుండా ఫోన్ తో పాటు చార్జర్ ఇవ్వనందుకు యాపిల్ పై బ్రెజిల్ సర్కారు లోగడ రెండు సార్లు ఫైన్ వేసింది. అయినప్పటికీ, యాపిల్ లో మార్పు రాలేదు. దీంతో బ్రెజిల్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని రిటైల్ స్టోర్లలో మరోమారు దాడులు నిర్వహించి యాపిల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బ్రెజిల్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోన్ తో పాటు తప్పకుండా చార్జర్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.