Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢీల్లి: ఓ 8 ఏళ్ల చిన్నారి తాజాగా తన తండ్రి, అతడితోపాటు ఇంకా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యను లేఖ ద్వారా ప్రధాని నరేంద్ర మోడి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ప్రస్తతం ఆ చిన్నారి రాసిన లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఎనిమిదేళ్ల చిన్నారి పేరు కాశ్వీ. గ్రేటర్ నోయిడాలోని చెర్రీ కౌటీ సొసైటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లిదండ్రులతో కలసి నివసిస్తోంది. స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి రోజూ సాయంత్రం వేళ తన తండ్రి ఆఫీస్ నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్న విషయాన్ని గుర్తించింది.
ఈ తరుణంలో మెట్రో విస్తరణ పనుల గురించి ప్రశ్నిస్తూ ఈ నెల 20న ప్రధాని మోడికి లేఖ రాసింది. మోడిజీ నేను రాసే ఈ ఉత్తరం మీ దృష్టికి వస్తుంది అనుకుంటున్నా. నేను నా తల్లిదండ్రులతో కలిసి గ్రెటర్ నోయిడా వెస్ట్ ప్రాంతంలో నివసిస్తున్నా. నేను మీకు ఎం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇక్కడ మాకు మెట్రో సౌకర్యం లేదు. ప్రజారవాణ వ్యవస్థ కూడా అందుబాటులో లేదు. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తారనే వార్తను గత కొన్నేళ్లుగా వింటూనే ఉన్నా. కానీ ఇప్పటి వరకు ఆ పనులు మొదలు కాలేదు. ఆ వార్తలు వినీ వినీ విసిగిపోయాం. దయచేసి మెట్రో విస్తరణ పనులు ప్రారంభించి మా సమస్యలు తీర్చండి అని లేఖలో తెలిపింది.