Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్: మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ జనవరి 27 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటన చేశారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందన్నారు. మంగళగిరి నియోజకర్గంలో తన పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్ర లో భాగంగా ఏడాది పాటు నియోజకవర్గానికి తాను దూరంగా ఉంటానని అన్నారు. ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చామని, తనను ఇక్కడ ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ చేసే కుయుక్తులను, వాడే ఆయుధాలను నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు సైనికుల మాదిరి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరి బాధ్యతలను మీ భుజస్కందాలపై పెడుతున్నానని రాష్ట్రంలో టీడీపీని గెలిపించే బాధ్యతలను తాను భుజాన వేసుకోబోతున్నాననితెలిపారు.