Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బడ్జెట్ ప్రతిపాదనలపై ఢిల్లీలో శుక్రవారం జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు హాజరు కాలేదు. 2023- 24 పద్దు పై కసరత్తులో భాగంగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాత్రం బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉండడం విశేషం. ఇలా ప్రీ బడ్జెట్ సమావేశాలకు హరీష్ రావు వడం ఇది రెండో పర్యాయం. రాష్ట్ర తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.