Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ల్యాప్‌టాప్ లాక్కొని, కీలక పత్రాలు చించేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లారెడ్డి అనుచరులు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు అప్పగించారు. ల్యాప్‌టాప్ ఇంకా బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంది. ల్యాప్‌టాప్‌ను తీసుకెళ్లాలని ఐటీని బోయిన్‌పల్లి పోలీసులు కోరారు. అయితే ఆ ల్యాప్‌టాప్ తమది కాదని ఐటీ అధికారి రత్నాకర్ తెలిపారు. తమ ల్యాప్‌టాప్‌ను ఇప్పించాలని ఐటీ అధికారులు కోరుతున్నారు.