Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ధావన్ సేన.. 7 వికెట్ల నష్టానికి 306 రన్స్ చేసింది. శ్రేయస్ అయ్యర్ 80, శిఖర్ ధావన్ 72, శుభమన్ గిల్ 50, అర్థ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 306 పరుగులు చేసింది. ఆఖరిలో వాషింగ్టన్ సుందర్ 37 మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. ఇక లక్ష్య చేదనకు దిగిన కివీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, మరో 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించింది. లాథమ్ 145, విలియంసన్ 94, తో చెలరేగారు. ఇక శార్దూల్ ఠాకూర్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో.. ఒక్కసారిగా మ్యాచ్ కివీస్ వైపు తిరిగింది. భారత బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.