Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ఫాస్ట్ మూవింగ్ సిటీల విభాగంలో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలకు అవార్డులు వరించాయి. వీటితో కలిపి స్వచ్ఛ సర్వేక్షన్-2022 ర్యాంకింగ్స్‌లో 23 అవార్డులతో పాటు ఇండియా స్వచ్ఛత లీగ్ కింద మరో మూడు అవార్డులను తెలంగాణ కైవసం చేసుకున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో మూడు నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న ఫాస్ట్ మూవింగ్ మీడియం సిటీల జాబితాలో వరంగల్ అర్బన్ మూడో స్థానంలో నిలిచింది. 50వేల నుంచి లక్ష జనాభా మధ్య ఉన్న ఫాస్ట్ మూవింగ్ సిటీల్లో కాగజ్‌నగర్ రెండోస్థానంలో, జనగామ మూడో స్థానం కైవసం చేసుకున్నది. 25వేల-50 వేల మధ్య జనాభా కలిగిన ఫాస్ట్ మూవింగ్ సిటీలలో రంగారెడ్డిలోని ఆమనగల్ రెండో స్థానంలో ఉంది. ఇక 15 వేల నుంచి 25 వేల మధ్య జనాభా కలిగిన ఫాస్ట్ మూవింగ్ సిటీలలో మేడ్చల్-మాల్కాజ్‌గిరి పరిధిలోని గుండ్లపోచంపల్లి రెండో స్థానంలో ఉండగా.. వనపర్తి పరిధిలోని కొత్తకోట మూడో స్థానంలో నిలిచింది.
15వేల కంటే తక్కువ జనాభా కలిగిన ఫాస్ట్ మూవింగ్ సిటీల జాబితాలో వరంగల్ జిల్లాలోని వర్ధనపేట రెండోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాతీయ స్థాయి శానిటేషన్ సర్వేను జూలై 2021 నుంచి జనవరి 2022 మధ్య నిర్వహించింది. పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, అవగాహనపై సర్వే సాగింది. దేశవ్యాప్తంగా 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో సర్వే చేపట్టింది. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికన తీసుకున్నారు.
అవార్డుకు ఎంపికైన పట్టణాలు..
1. ఆదిభట్ల మున్సిపాలిటీ
2. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్
3. భూత్పూర్ మున్సిపాలిటీ
4. చండూర్ మున్సిపాలిటీ
5. చిట్యాల మున్సిపాలిటీ
6. గజ్వేల్ మున్సిపాలిటీ
7. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ
8. హుస్నాబాద్ మున్సిపాలిటీ
9. కొంపల్లి మున్సిపాలిటీ
10. కోరుట్ల మున్సిపాలిటీ
11. కొత్తపల్లి మున్సిపాలిటీ
12. నేరుడుచర్ల మున్సిపాలిటీ
13. సికింద్రాబాద్ కంటోన్మెంట్
14. సిరిసిల్ల మున్సిపాలిటీ
15. తుర్కయాంజల్ మున్సిపాలిటీ
16. వేములవాడ మున్సిపాలిటీ
20. వరంగల్ కార్పొరేషన్
21. వర్థన్నపేట మున్సిపాలిటీ
22. జనగామ మున్సిపాలిటీ
23. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ
24. కొత్తకోట మున్సిపాలిటీ
25. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ
26. అమన్‌గల్ మున్సిపాలిటీ