Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో భేటీ అయ్యారు. తమ నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు, వైసీపీ అరాచకాలను వారు చంద్రబాబుకు వివరించారు. ‘ప్రభుత్వ వైఫల్యాలతో రాజకీయంగా తాము ఫినిష్ అయ్యామని వైసీపీ నేతలకు కూడా అర్థమైంది. రాజకీయ మనుగడ కోసం సీఎంతో సహా వైసీపీ నేతలంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లోపల మాత్రం ఓటమి భయం వారికి నిద్ర లేకుండా చేస్తుంది. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. మార్పు కోరుకుంటున్నారు. టీడీపీ సభల భారీ సక్సెస్‌తో వైసీపీలో కలవరపాటు మొదలైంది. అంగ, అర్థ బలం సహా ఏదీ తమ ప్రభుత్వాన్ని రక్షించలేదనే వాస్తవాన్ని చాలా మంది వైసీపీ నేతలు గుర్తించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులను కూడా మార్చుకున్నారు.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.