Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్: రామజన్మభూమి అయిన అయోధ్యలో జరిగిన సామూహిక వివాహాల కార్యక్రమంలో 1,300 మంది హిందూ, ముస్లిం జంటలు పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి కట్నకానుకలలు లేకుండా చేసుకున్న సామూహిక వివాహాల కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అయోధ్య, అంబేద్కర్ నగర్ జిల్లాలకు చెందిన 1,356 మంది అమ్మాయిలు కట్నం లేకుండా వివాహాలు చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ గ్రౌండ్‌లో సామూహిక వివాహ కార్యక్రమాన్ని కార్మిక, ఉపాధి శాఖ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో 1,342 మంది హిందూ జంటలు, 14 మంది ముస్లిం జంటలు పెళ్లి చేసుకున్నారు. గాయత్రి పరివార్ హిందూ జంటలకు వివాహ ఆచారాలను నిర్వహించింది. ముస్లిం జంటలకు ముస్లిం ఖాజీ నికాహ్ జరిపారని జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ తెలిపారు.
నూతన వధూవరులకు బహుమతి
పెళ్లి చేసుకున్న జంటలందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.75 వేలు బహుమతిగా అందించారు. వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయినట్లు అధికారి తెలిపారు.ఈ వేడుకలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మంత్రి అనిల్ రాజ్‌భర్ మాట్లాడుతూ యోగి ప్రభుత్వం రెండో దఫాలో ఐదు లక్షల మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశామన్నారు.అయోధ్య జిల్లా యంత్రాంగం అక్కడికక్కడే జంటలకు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లను జారీ చేసింది.