Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖతార్: రెండుసార్లు ఫిఫా ఛాంపియన్ గా నిలిచిన అర్జెంటీనా జట్టును సౌదీ టీమ్ ఓడించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సౌదీ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. సౌదీ ఫుట్ బాల్ జట్టుపై సామాన్యుడి నుంచి యువరాజు దాకా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, అర్జెంటీనాపై సంచలన విజయం నమోదు చేసిన తమ జట్టు ఆటగాళ్లకు సౌదీ యువరాజు ఖరీదైన బహుమతులు అందజేయనున్నారు. జట్టు సభ్యులు ఒక్కొక్కరికీ సుమారు రూ.11 కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ కారును అందజేయనున్నారు. వరల్డ్ ర్యాంకింగ్స్ లో అర్జెంటీనా, సౌదీ అరేబియా జట్ల మధ్య 48 ర్యాంకుల తేడా ఉంది. పైగా, ఫుట్ బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ సారథ్యంలో పటిష్ఠంగా ఉన్న అర్జెంటీనా జట్టును సౌదీ జట్టు ఓడించడం విశేషం. దాదాపు మూడేళ్లుగా అర్జెంటీనా జట్టుకు ఓటమనేదే తెలియదు. 2022 ఫిఫా వరల్డ్ కప్ బరిలో ఉన్న ఫేవరేట్ జట్లలో అర్జెంటీనా టాప్ లో ఉంది.