Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్ర: ఓటరుగా నమోదుపై యువతలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో ప్రవేశాలను ఓటు హక్కుతో ముడిపెట్టాలని నిర్ణయించి, అడ్మిషన్ కావాలంటే ఓటు హక్కు తప్పనిసరిగా ఉండాలని రూల్ తీసుకురానున్నట్లు తెలిపింది. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కొత్త నిబందనను అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఉన్నత విద్యావ్యవస్థలో చదువుతున్న 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, కేవలం 32 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు కోసం ముందుకొచ్చారు. దీంతో యూనివర్సిటీలు, కాలేజీలలో అడ్మిషన్ కావాలంటే ఓటు హక్కు ఉండాల్సిందేనని నిబందనను తెచ్చారు.