Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ- సి 54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. EOS శాట్-6తో పాటు 8 నానో ఉపగ్రహాలను.. పీఎస్ఎల్వీ- సి 54 రాకెట్ కక్ష్యలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఓషన్ శాట్ ఉపగ్రహాన్ని, పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్‌ను విజయవంతంగా ప్రవేశ పెట్టిందన్నారు. సోలార్ ప్యానెల్స్ ఓపెన్ అయ్యాయన్నారు. నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహం చేరిందని సోమనాథ్ పేర్కొన్నారు. ఇంకా 8 ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశ పెట్టాల్సి ఉందన్నారు. వేగాన్ని తగ్గించి ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతామన్నారు. ఇంకా 2 గంటలు సమయం పడుతుందని సోమనాథ్ పేర్కొన్నారు.