Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పలు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో నిన్న సీబీఐ తన తొలి చార్జిషీట్ దాఖలు చేయగా, నేడు ఈడీ కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సాఫ్ట్ కాపీతో కూడిన హార్డ్ డిస్క్ సహా చార్జిషీట్ కాపీలను ఈడీ కోర్టుకు సమర్పించింది. అటు, ఈ కేసులో ఏ1 నిందితుడు విజయ్ నాయర్ కు కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. విజయ్ నాయర్ కస్టడీ ముగియడంతో అతడిని ఈడీ అధికారులు నేడు కోర్టులో హాజరుపరిచారు. అతడికి రౌస్ అవెన్యూ కోర్టు డిసెంబరు 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దాంతో విజయ్ నాయర్ ను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.