Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డిసెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ కానున్న పంచతంత్రం ట్రైలర్ ఆకట్టుకుంటోంది. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల తదితరులు నటిస్తోన్న యాంథాలజీ 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసిన చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం, నేపథ్య సంగీతం.. రాజ్ కె.నల్లి సినిమాటోగ్రఫీ సన్నివేశాలను, వాటిలోని ఎమోషన్స్‌ను నెక్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ట్రైలర్ చూస్తున్నప్పుడు మనసుకు తెలియని ఆర్ద్రత కలుగుతుంది. సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అనే ఆసక్తి పెరుగుతుంది.