Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు, పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. వచ్చే నెల 8వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున బీసీ సభను వైసీపీ నిర్వహించబోతోంది. ఎన్నికల తరుణంలో బీసీలపై వైసీపీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ బీసీ సభకు ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. బీసీల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి జగన్ ఒక డిక్లరేషన్ ను ప్రకటించారని తెలిపారు. 139 బీసీ కులాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి సంక్షేమ ఫలాలను అందించారని కొనియాడాడు. బీసీలకు టీడీపీ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని, వైసీపీ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని ఎలా పెంపొందించిందో తెలియజేస్తామన్నారు.