Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ ముర్రే అనారోగ్యంతో శనివారం మరణించాడు. 72 ఏళ్ల వయసు ఉన్న ముర్రే బార్బడోస్‌లో బ్రిడ్జ్‌టౌన్‌లో ఉన్న తన ఇంటి ఆవరణలో ప్రాణాలు విడిచాడు. స్మోకింగ్, డ్రగ్స్ అలవాటు కారణంగా ముర్రే ఆరోగ్యం క్షీణించింది. 1978-82 మధ్య కాలంలో క్లైవ్ లాయిడ్స్ కెప్టెన్సీలో వెస్టిండీస్ జట్టు తరఫున ఆడాడు. ఆ సమయంలో వెస్టిండీస్ జట్టు క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఉంది. వికెట్ కీపర్, బ్యాటర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదిలే నైపుణ్యం ఈయన సొంతం. అందుకనే ఇప్పటికీ కరీబియన్ క్రికెట్ చరిత్రలో ఉత్తమ కీపర్‌గా ముర్రే పేరు చెప్పుకుంటారు.
నాలుగేళ్ల కాలంలో ఆయన 19 టెస్ట్‌లు, 10 వన్డేలు మాత్రమే ఆడాడు. అందుకు కారణం ఏంటంటే.. జాతీయ జట్టులో పోటీ ఎక్కువ ఉండడంతో రెబెల్స్ టీమ్‌తో కలిసి ముర్రే 1980లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. దాంతో, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. ఆయనకు చిన్న వయసు నుంచే ముర్రేకు సిగరెట్లు, మరిజునా అనే డ్రగ్ అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకుంటున్నాడనే కారణంతో ముర్రేను 1975-76 మధ్య ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పించారు. జాతీయ జట్టులో చోటు కోల్పోయిన తర్వాత ఆయన కొకైన్‌కు బానిస అయ్యాడని చెప్తారు. ముర్రే కుమారుడు రికీ హొయతే కూడా క్రికెటరే. అతను బార్బడోస్ జట్టు తరఫున వికెట్ కీపర్‌గా కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.