Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మీరట్ పట్టణంలోని మెహిఉద్దీన్‌పూర్‌లో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చీఫ్ ఇంజనీర్ నరేంద్ర కుష్వహ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. చీఫ్ ఇంజనీర్ నరేంద్ర ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఎత్తైన గోడ మీద నుంచి కిందకి దూకాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కానీ, గాయాల తీవ్రత ఎక్కువ ఉండడంతో ఆస్పత్రిలోనే ప్రాణాలు విడిచాడు. మంటల్ని ఆర్పేందుకు 7 అగ్నిమాపక కేంద్రాలు సంఘటన స్థలానికి తరలివచ్చాయి. పర్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో టర్బన్‌ను ఆపరేట్ చేస్తుండగా అది ఎగిరి కింద పడింది. ఆ సమయంలోనే ఫ్యాక్టరీలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దాంతో, కార్మికులు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి బయటకు పరుగులు తీశారు. అయితే మా చీఫ్ ఇంజనీర్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు్ణ అని చక్కెర ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ శీష్‌పాల్ సింగ్ చెప్పాడు.