Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 300కి చేరువయ్యాయి. వీటిలో గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదయ్యాయి. గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 నెలల బాలుడు కన్నుమూశాడు. దీంతో మీజిల్స్‌తో నగరంలో మొత్తం 13 మంది చిన్నారులు మృతిచెందారు.