Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరంగల్‌లో విషాదం చోటుచేసుకున్నది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్ గత కొంతకాలంగా వరంగల్‌లోని డాల్ఫిన్ గల్లీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా, ఇటీవల కంగర్‌సింగ్ ఆస్ట్రేలియా వెళ్లొచ్చారు. ఆయన అక్కడినుంచి విదేశీ చాక్లెట్లు తీసుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్తుండగా ఆ చాక్లెట్లను ఇచ్చారు. వారిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్ (8) స్కూల్‌కు వెళ్లిన తర్వాత చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కిందపడిపోయాడు. గుర్తించిన పాఠశాల సిబ్బంది అతడిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. తండ్రి కంగర్‌సింగ్‌కు సమాచారం అందించారు. అయితే గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన డాక్టర్లు.. చికిత్స అందిస్తుండగానే ఆ చిన్నారు మృతిచెందాడు.