Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏలూరు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెంలో ఆర్అండ్‌ఆర్ నిర్వాసితులకు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఇంటి పట్టాల పంపిణీ చేశారు. కుక్కునూరు మండలంలోని కుక్కునూరు గ్రామంలో 49 మందికి కివ్వాక గ్రామంలో నలుగురికి ఇంటి పట్టాలిచ్చారు. అలాగే వేలేరుపాడు మండలంలోని శ్రీరాంపురం 120 మందికి, కొయిదా 47 మంది ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 220 మందికి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండల జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, మండల కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.