Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: మైసూరులోని నేషనల్ హైవే-766 వద్ద ఉన్న బస్టాండ్ మసీదును పోలి ఉండటంపై కర్ణాటక బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బస్టాండ్ ఫోటోను ఇటీవల సోషల్ మీడియాలో చూశానని అన్నారు. ఈ బస్టాండ్‌ను అధికారులు వెంటనే కూల్చేయాలని, లేదంటే తానే జేసీబీ తెచ్చి కూల్చేస్తానని హెచ్చరించారు. ఈ బస్టాండ్‌ను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దాస్ కట్టించారు.
ఎంపీ వ్యాఖ్యలపై తొలుత ఆయన స్పందిస్తూ, మైసూరు ప్యాలెస్ స్ఫూర్తితో బస్టాండ్‌ను డిజైన్ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత ఆయన స్థానిక ప్రజలను ఉద్దేశించి ఒక లేఖ రాస్తూ జరిగిన దానికి క్షమాపణలు తెలియజేశారు. కేవలం మైసూరు వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ పని చేసినట్టు వివరణ ఇచ్చారు. భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో డోమ్స్‌ను తొలగిస్తున్నానని, ఎవరి మనోభావాలు గాయపడినా దానికి తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని అన్నారు. ఈ తరుణంలోనే మసీదును పోలిన బస్టాండ్ డిజైన్ మారి కొత్తరూపు సంతరించుకుంది. బస్టాండ్‌లో జరిగిన మార్పుల ఫోటోలను ఎంపీ సిన్హా ఆదివారంనాడు అందరికీ షేర్ చేశారు. తన ఆందోళనతో ఏకీభవించి, సహకరించిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దాస్‌కు, స్థానిక యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.