Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తూరు: బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్9 ఏసీ కోచ్‌లో అగ్నికీలలు ఎగిసిపడినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో రైలును చిత్తూరు జిల్లాలోని కుప్పం స్టేషన్‌లోనే నిలిపివేశారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైల్లో నుంచి ప్రయాణికులు పరుగులు పెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.