Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. మహిపాల్‌పూర్ ఫ్లై ఓవర్‌పై వెళ్తున్న ఓ సైక్లిస్టును బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్ నుజ్జునుజ్జు కాగా, సైక్లిస్టు సుభేందు ఛటర్జీ(50) తీవ్ర గాయాల పాలయ్యాడు. అప్రమత్తమైన కారు డ్రైవర్.. ఛటర్జీని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని గురుగ్రామ్ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఛటర్జీ ధౌలా కున్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా బీఎండబ్ల్యూ ఢీకొట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే బీఎండబ్ల్యూ కారు టైరు పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు వీఐపీకి చెందినదిగా సమాచారం. ఆ కారుపై ప్రెసిడెంట్ ఫైనాన్స్ కమిటీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు అని రాసి ఉంది.