Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రోరైల్ ప్రాజెక్టు రెండో దశ పనులను నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.6,250 కోట్ల నిధులతో చేపట్టాలని తలపెట్టింది. మెట్రోరైల్ మొదటి దశ పనులను పిపిపి మోడల్ తరహాలో చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశ పనులను మాత్రం పూర్తిగా ప్రభుత్వం నిధులతోనే చేపట్టనుంది. కాగా రెండవ దశ పనులను మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు చేపట్టనుంది. ఈ పనులను డిసెంబర్ 9న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనుంది. రెండో దశ మార్గం బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల నానక్‌రామ్ గూడ జంక్షన్‌ను తాకుతూ వెలుతుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా మె ట్రో రైలు నడుస్తుంది. ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది.