Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలోని రెండు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోట ఈ అవార్డులకు ఎంపికవ్వడం విశేషం. గోల్కొండ మెట్లబావి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ కేటగిరీలో, దోమకొండ కోట అవార్డ్ ఆఫ్ మెరిట్ కేటగిరీలో చోటు సంపాదించుకున్నాయి. అలాగే, ముంబైలోని ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియంకు అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ లభించగా, దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు అవార్డ్ ఆఫ్ మెరిట్ లభించాయి. ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల నుంచి 50 చారిత్రక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు అందగా, చివరికి ఆరు దేశాలకు చెందిన 13 కట్టడాలకు ఐదు కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు. వీటిలో నాలుగు భారత్‌కు, మరో నాలుగు చైనాకు దక్కగా ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ దేశాలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి.