Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్ష రైల్వే జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం ఫుట్‌ఓవర్ బ్రిడ్జి స్లాబులు కూలిన ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఫుట్ఓవర్ బ్రిడ్జి స్లాబులు కూలిపోయాయి. ఆ సమయంలో బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న పలువురికి గాయాలయ్యాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ 48 ఏండ్ల మహిళ మహిళ మృతిచెందింది.