Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో మాంసం వినియోగం విపరీతంగా పెరిగింది. గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి, విక్రయాలు జరిగినట్టు భారత జాతీయ మాంసం పరిశోధన సంస్థ అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ తరుణంలో దేశం లో అత్యధికంగా మాంసాహారం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. గత నాలుగేళ్లలో అమ్ముడైన మాంసం ధర కిలోకు సగటున రూ. 600గా లెక్కిస్తే మొత్తంగా రూ. 58,500 కోట్లను మాంసం కోసం జనం వెచ్చించారు. ఇక, గొర్రెల సంఖ్యలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 1.90 లక్షలకు పైగా గొర్రెలు ఉన్నాయి. రాష్ట్రంలో 2015-16లో గొర్రెలు, మేకల మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులుగా ఉండగా, 2020-21 నాటికి అది రెండింతలై 3.03 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఏడాది అది 3.50 లక్షల టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇందుకోసం రూ. 31 వేల కోట్లకుపైగా సొమ్మును జనం వెచ్చించే అవకాశం ఉంది. దేశంలో గొర్రెలు, మేకల మాంసం తలసరి వార్షిక వినియోగం 5.4 కిలోలైతే తెలంగాణ అత్యధికంగా 21.17 కిలోలుగా ఉందని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య తెలిపింది