Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జార్ఖండ్‌కు చెందిన శంషాద్ (35) కొంతకాలంగా ఆబిడ్స్‌లోని ఓ భవన నిర్మాణంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. శనివారం ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందపడ్డాడు. అక్కడున్న ఇనుప రాడ్లు శంషాద్ పొట్టలో గుచ్చుకున్నాయి. తోటి కార్మికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శంషాద్‌కు అవసరమైన రక్తాన్ని హెల్పింగ్ హ్యాండ్ ప్రతినిధులు సేకరించగా, ఉస్మానియా వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. సీటీ స్కాన్ హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీనివాస్, యూరాలజీ డాక్టర్ నితీష్, సర్జికల్ గ్రాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ ఆదిత్య, జనరల్ సర్జరీ, అనస్తీషియా డాక్టర్ అజితలతో కూడిన మల్టీ డిసిప్లినరీ వైద్యబృందం శస్త్రచికిత్సను నిర్వహించింది. ఐదు గంటల పాటు శ్రమించి రాడ్లను తొలగించింది బాధితుడి ప్రాణాలు కాపాడారు. వైద్యులు తెలిపిన ప్రకారం కడుపులోకి చొచ్చుకెళ్లిన రాడ్ల కారణంగా చిన్న పేగులకు చిల్లులుపడ్డాయని, ఇతర అవయవాలు బాగానే ఉన్నాయని తెలిసింది.