Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యూసు్‌ఫగూడ స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న జ్యోతి నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఆదివారం ఆమెకు నొప్పులు రావడంతో స్టేట్ హోం సిబ్బంది 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు పెరిగిపోయాయి అంబులెన్స్ ఈఎంటీ ఎస్.వెంకటేష్, పైలట్ శ్రీధర్‌లు వాహనాన్ని నిలిపి ఆమెను పరీక్షించగా కడుపులో బిడ్డ పేగు చుట్టుకొని ఉన్నట్టు గ్రహించారు. వెంటనే వారు ఆమెకు పురుడు పోశారు. జ్యోతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తదుపరి చికిత్స నిమిత్తం ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు.