Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హర్యానాలో సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలైన ఘటన చోటు చేసుకుంది. ఈ తరుణంలో అభ్యర్థికి గ్రామస్థులందరూ కలిసి రూ.11 లక్షల నగదుతోపాటు ఓ కారు, కొంత భూమి బహుమతిగా అందించారు. ఫతేహాబాద్‌లోని నధోడి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 4,416 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సుందర్ అనే అభ్యర్థికి 2,200 ఓట్లు, నరేందర్ అనే మరో అభ్యర్థికి 2,201 ఓట్లు వచ్చాయి. దీంతో సుందర్ ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే, ఓడిపోయిన సుందర్‌కు గ్రామస్థులు రూ.11,11,000 నగదు, ఓ స్విఫ్ట్ డిజైర్ కారు, కొంత భూమిని బహుమతిగా ఇచ్చారు. అలాగే, ఫరీదాబాద్ జిల్లాలోని ఫతేపూర్ తాగా గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ను కూడా స్థానికులు ఇలాగే గొప్పగా సన్మానించారు. రూ. 11 లక్షల విలువైన రూ. 500 నోట్లతో గజమాల తయారు చేసి దానితో ఆయనను సన్మానించారు.