Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 5వ విడత యాత్రను సోమవారం నుంచి ప్రారంభించాలని బండి సంజయ్ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకోగా తొలుత యాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేసి సంజయ్ ను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో యాత్రకు అనుమతి విషయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ బండి సంజయ్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. బహిరంగ సభకు మాత్రం షరతులు విధించింది. భైంసా సిటీలోకి యాత్ర ప్రవేశించకూడదని, సిటీకి కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభ పెట్టుకోవాలని షరతులు విధించింది. లా అండ్ ఆర్డర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు హైకోర్టు బెంచ్ సూచించింది.