Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పాత సచివాలయాన్ని కూలగొట్టి అదే స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలిసిందే. ఈ తరుణంలో దాదాపు నిర్మాణం పూర్తై పోయినట్టే. ఈ క్రమంలోనే ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం డేట్, టైమ్ ఫిక్స్ చేసింది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించనుంది. ఆ రోజు నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముందుగా 6వ అంతస్తులోని సీఎం బ్లాకును ప్రారంభించి తన ఛాంబర్లో కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.