Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహిళలు దుస్తులు లేకున్నా బాగుంటారంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. మహిళలు చీరలు, సల్వార్ సూట్స్ లో చూడ చక్కగా ఉంటారని.... అసలు ఏం ధరించకపోయినా బాగుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఇక తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాందేవ్ బాబా క్షమాపణ చెప్పారు. మహిళల సాధికారత కోసం, మహిళలు గౌరవంగా వెలుగొందడం కోసం తాను ఎల్లప్పుడూ శ్రమించే వ్యక్తినని అన్నారు. ఆడవారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరిపైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెపుతున్నానని అన్నారు.