Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనుల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫస్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిలర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌లో జరుగుతున్న పనులను సీఎం నిశితంగా పరిశీలించారు. మరికాసేపట్లతో ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. 2023, డిసెంబర్ చివరి నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి వెలుగులు పంచాలని జెన్‌కోకు సూచించారు. పనులను వేగవంతం చేయాలన్నారు.
2015లో ఈ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం కాగా, ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. 5 వేల ఎకరాల్లో రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో 5 పవర్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు.