Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని... కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు బీజేపీలోకి రావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది బీజేపీనే అని చెప్పారు.