Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిల అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకర్తలపై పోలీసులు లారీఛార్జ్ చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మా పాదయాత్రకు అనుమతి ఉంది. బస్సును దగ్ధం చేసినవారిని అరెస్ట్ చేయకుండా.. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు.