Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో మత్స్యకారుల వలకు కొండ చిలువ చిక్కింది. లోయర్ మానేర్ డ్యాంలో చేపలు పట్టేందుకు ఆదివారం రాత్రి వలవేసి పెట్టగా సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి వలలో సుమారు మూడు మీటర్ల కొండచిలువ కనిపించింది. దీంతో మత్స్యకారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో వలను ఒడ్డుకు లాక్కొచ్చారు. వలలో చిక్కుకున్న కొండ చిలువ అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు. గతంలోనూ గన్నేరువరం మత్స్యకారులకు రెండు సార్లు వలలకు కొండచిలువ చిక్కింది. లోయర్ మానేరు డ్యామ్ లో ఇంకా ఎన్ని కొండ చిలువులు ఉంటాయోనని మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు.