Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అమెజాన్‌లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. భారత్‌లో కొన్ని కార్యకలాపాలను మూసివేయాలని ఈకామర్స్ దిగ్గజం నిర్ణయించడంతో వచ్చే నెలలో వందలాది మందిని విధుల నుంచి తొలగించేందుకు సన్నద్ధమైంది. భారత్‌లో ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను అమెజాన్ నిలిపివేస్తోందని, చిరు వ్యాపారులకు ప్యాకేజ్డ్ కన్జూమర్ గూడ్స్ డెలివరీలను కూడా నిలిపివేయనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. వచ్చేనెలలో ఈ ఆపరేషన్స్ మూసివేత నేపధ్యంలో వందలాది భారత వర్కర్ల ఉద్యోగాలు ఊడనున్నాయని ఈ రిపోర్ట్ బాంబు పేల్చింది. మరోవైపు భారత్‌లో ఎడాపెడా ఉద్యోగాల కోతకు తెగబడుతుండటం పట్ల అమెజాన్‌పై కేంద్ర కార్మిక శాఖ సీరియస్‌గా స్పందించింది. రాత్రికి రాత్రి ఉద్యోగులను తొలగించడంపై ఈకామర్స్ దిగ్గజం వివరణ కోరింది.
మరోవైపు అసాధారణ, అనిశ్చిత స్ధూలఆర్ధిక పరిస్ధితుల కారణంగానే పెద్ద సంఖ్యలో లేఆఫ్స్ తప్పలేదని అమెజాన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులను జాప్యం చేయాలని కూడా అమెజాన్ యోచిస్తోంది.