Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న తెహల్కా మ్యాగజీన్ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తరుణ్ తేజ్‌పాల్ లిఫ్టులో తనను లైంగికంగా వేధించాడంటూ తన మ్యాగజీన్‌లో అంతకుముందే యాంకర్‌గా పనిచేసిన ఓ యువతి అతనిపై 2013లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతున్నది. ఈ క్రమంలో తన కేసులో ఇన్ కెమెరా హియరింగ్ జరపాలంటూ తేజ్‌పాల్ గోవాలోని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, బాంబే హైకోర్టు అతని పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆ పిటిషన్‌పై విచారణకు నిరాకరించింది.