Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: షియోమి 12కి కొనసాగింపుగా షియోమి 13 సిరీస్‌ను డిసెంబర్ 1న లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ తన అధికారిక వీబో పేజ్‌లో వెల్లడించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో లీకా ట్యూన్డ్ కెమెరాలతో షియోమి లేటెస్ట్ సిరీస్ కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సిరీస్‌లో షియోమి 13 ప్రొ పేరుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ రానుందని అఫిషియల్ పోస్టర్ వెల్లడించింది. ఇక షియోమి 13 ప్రొ కర్వ్డ్ డిస్‌ప్లేతో రెగ్యులర్ మోడల్ ఫ్లాట్ డిస్‌ప్లేతో ఉంటుందని చెబుతున్నారు. లాంఛ్ ఈవెంట్ డిసెంబర్ 1 రాత్రి ఏడుగంటలకు ఉంటుందని కంపెనీ తెలిపింది. షియోమి లేటెస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్‌పై రన్ అవుతుంది.
ఇక షియోమి 12 ప్రొను భారత్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంఛ్ చేయగా ధర రూ.62,999 కాగా, భారత్‌లో షియోమి 13 ప్రొ ధర కొంచెం అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక షియోమి 13 సిరీస్ ఫీచర్ల విషయానికి వస్తే..లీకుల ఆధారంగా లేటెస్ట్ షియోమి సిరీస్ స్నాప్‌డ్రగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో, ప్రొ మోడల్ 6.65 ఇంచ్ 2కే రిజల్యూషన్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో కస్టమర్ల ముందుకు రానుంది.