Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. వరిధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) రెండుశాతం సీఎస్టీ పన్ను బకాయిని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి తెలంగాణ రైసు మిల్లర్ల ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని పునరుద్ఘాటించారు.