Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నవీపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బస్సు, ట్రాలీ వాహనం ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భైౖంసా డిపోకు చెందిన అద్దె ఎక్స్‌ప్రెస్ బస్సు నిజామాబాద్ నుంచి భైౖంసాకు వెళుతుంది. నవీపేట బస్టాండ్ గేట్ నుంచి బస్సు బయటకు వెళుతుండగా బాసర నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న ట్రాలీ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ప్రమాదానికి గురైన వాహనాలను నవీపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.