Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సీబీఐ సీనియర్ ఐపీఎస్ అధికారిగా నటించిన వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీనియర్ ఆఫీసర్‌ని అని చెప్పుకుంటూ అనేక మంది వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకున్న ఒక ప్రైవేట్ వ్యక్తిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నకిలీ అధికారిని విశాఖపట్నం చిన్నవాల్తేరుకు చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావుగా గుర్తించారు. అతని ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.21లక్షల నగదు, గోల్డ్ స్టోన్స్ లభ్యమయ్యాయి. నిందితుడు ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఉంటున్నాడు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా నటించాడు. నిందితుడుని అరెస్ట్ అనంతంర ఢిల్లీలోని కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.