Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీనియర్ల వేధింపులు తట్టుకోలేక, వారి నుంచి తప్పించుకునేందుకు అస్సాంలోని దిబ్రూగఢ్ యూనివర్సిటీలో ఆనంద్ శర్మ అనే విద్యార్థి రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనకు కారణమైనట్లుగా భావిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తన కుమారుడిని సీనియర్ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా వేధించేవారని బాధితుడి తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి డబ్బులు గుంజుకునే వారని, మొబైల్ లాక్కొని హింసించేవారని, కొన్నిసార్లు చంపేందుకూ యత్నించారని తెలిపారు. మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫొటోలు తీసేవారని, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరించే వారని పోలీసులతో చెప్పారు.